గుజరాత్ హైకోర్టులో ఆన్‌లైన్ విచారణ సందర్భంగా ఓ వ్యక్తి టాయిలెట్‌లో కూర్చుని హాజరయ్యాడు. ఈ సంఘటన జూన్ 20న జస్టిస్ నిర్జర్ ఎస్ దేశాయ్ ధర్మాసనం ముందు చోటుచేసుకుంది. అక్కడ ‘సమద్ బ్యాటరీ’గా లాగిన్ అయిన వ్యక్తి ప్రత్యక్ష ప్రసార సమయంలో టాయిలెట్‌లో మలవిసర్జన చేసి తనను తాను శుభ్రం చేసుకుంటున్న దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఈ ఊహించని సంఘటన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Kodali Nani: గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి నాని.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు..!
గుజరాత్ హైకోర్టులో ఆన్‌లైన్‌లో ఓ కేసు విచారణ జరుగుతోంది. వర్చువల్ విచారణలో ఓ వ్యక్తి టాయిలెట్‌లో మలవిసర్జన చేస్తున్నట్లు కనిపించాడు. వీడియో ప్రారంభంలో ‘సమద్ బ్యాటరీ’ పేరుతో లాగిన్ అయిన వ్యక్తి మెడలో బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు ధరించి ఉన్న క్లోజప్‌ను చూపిస్తుంది. ఆ తర్వాత అతను తన ఫోన్‌ను దూరంగా ఉంచడం కనిపిస్తుంది. ఇది అతను టాయిలెట్‌లో కూర్చున్నట్లు సూచిస్తుంది. వీడియోలో అతను తనను తాను శుభ్రం చేసుకుని, వాష్‌రూమ్ నుంచి బయటకు వెళ్తున్నట్లు కూడా చూపిస్తుంది. ఆ తర్వాత అతను కొంతసేపు స్క్రీన్‌ను ఆపి టాయిలెట్ నుంచి బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. కోర్టు రికార్డుల ప్రకారం, ఆ వ్యక్తి తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రతివాదిగా హాజరయ్యాడు. క్రిమినల్ కేసులో అతడిపై కేసు నమోదైంది.
A video showing a man attending Gujarat High Court virtual proceedings while seated on a toilet and apparently relieving himself has gone viral on the social media.
Read full story: https://t.co/FbendKMD2M #GujaratHighCourt #VirtualHearings #VideoConferencehearing… pic.twitter.com/spyxMiptiO
— Bar and Bench (@barandbench) June 27, 2025