ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం…
పహల్గామ్ దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాక్ మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా పీవోకే లోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది.
Iran Nuclear Site: ఇజ్రాయెల్ చేపట్టిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరిట నిర్వహించిన వైమానిక దాడుల తర్వాత, ఇరాన్ అణుశక్తి కేంద్రాల్లో సంభవించిన నష్టాన్ని స్పష్టంగా చూపించే ఉపగ్రహ చిత్రాలను మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసింది. ఈ చిత్రాలలో నాటాంజ్, ఫోర్డో ఇంకా ఇస్ఫహాన్ ప్రాంతాల్లోని కీలక అణు కేంద్రాలపై జరిగిన దాడుల ముందు, తర్వాత పరిస్థితుల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడులలో నాటాంజ్ అణు కేంద్రం పైభాగంలోని కీలక నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, అంతర్జాతీయ అణు…