పహల్గామ్ దాడి తర్వాత తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్ తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పాక్ మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా పీవోకే లోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది.
India Pak War : పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన దుశ్చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. శనివారం ఉదయం నుంచే జైసల్మేర్ వ్యాప్తంగా పోలీసులు, ఆర్మీ అప్రమత్తమయ్యారు. నగరమంతా ఖాళీ చేయిస్తున్నారు. భయానక సైరన్‌ల మోతతో జైసల్మేర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జైసల్మేర్‌కు కేవలం 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిడా గ్రామంలో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్‌ను భారత ఆర్మీ సమర్థవంతంగా కూల్చివేసింది. అయితే ముప్పు ఇంకా పొంచి ఉందన్న హెచ్చరికలతో…
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా అఖ్నూర్‌లోని బట్టల్ ప్రాంతంలో ఆర్మీ అంబులెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.