Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలోని అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు కనిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఆలయంలోని నాల్గవ ప్రహారం (బయటి ప్రాంగణం) ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ సన్నిధి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఏ ఉత్సవాలు జరిగినా.. ఏదో ఒక అలజడి, వివాదం రేగుతూనే వుంటుంది. ఇంద్రకీలాద్రి పై మళ్లీ చీరాల గోల్ మాల్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ఏడాది కనిపించకుండా పోయిన అమ్మవారి చీరాల లెక్కలు చెప్పాలంటూ రాష్ట్ర ఆడిట్ అధికారులు అడగడంతో ఇంద్రకీలాద్రి అధికారులు ఈ వ్యవహారం కాస్త బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. గత ఏడాది కూడా కనిపించకుండా పోయిన చీరాల…
సోషల్ మీడియాలో ఆగంతకులు రెచ్చిపోతున్నారు. దేవుడిని, గుళ్ళను, దేవతలను ఎవరినీ వదలడం లేదు. తాజాగా కేటుగాళ్ళు మరీ పేట్రేగిపోయారు. భద్రాచలంలోని రాములోరి గుడిని టార్గెట్ చేశారు. Bhadrachalam temple city ..భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం పేరుతో ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అంతటితో ఆగకుండా మరీ రెచ్చిపోయారు. పలు అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు ఆగంతకులు. రెండురోజులుగా ఫేస్ బుక్‌లో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్ళారు రామభక్తులు. దీనిపై ఆలయ…