Anni Manchi Sakunamule: నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ‘అన్నీ మంచి శకునములే’ ఈ నెల 18న జనం ముందుకు రాబోతోంది. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, “నందిని రెడ్డి గారు కథ చెప్పినప్పుడు మ్యూజిక్ ఎలా ఇవ్వాలనేది అర్తమైంది. విక్టోరియా పురం అనే ఊరి కథ కాట్టి ఊరికి తగిన విధంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ వుండాలి. అదో కొత్త ప్రపంచం. ఎందుకంటే లిటిల్ బిట్ ఆఫ్ బ్రిటీష్ టైప్ లో వుంటుంది. వాటికి ట్యూన్ మ్యాచ్ అయ్యేవిధంగా చూసుకున్నాను. పాటలు డిఫరెంట్ గా పీస్‌ఫుల్ గా వుంటాయి. నా వరకూ నేను ఏ సినిమాకైనా వందశాతం ఎఫర్ట్ పెడతాను. ఒకవేళ సినిమా బాగోకపోతే ప్రతీదీ స్పాయిల్ అవుతుంది. అదే జరిగే ప్రతి దానికీ విమర్శలు ఎదురవుతాయి. సహజంగా స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బాగుంటే మా జాబ్ సక్సెస్ అవుతుంది” అని అన్నారు.
‘మహానటి’ తర్వాత మళ్ళీ అదే సంస్థలో వర్క్ చేయడం గురించి చెబుతూ, “స్వప్న, ప్రియాంక, నాగ్ అశ్విన్, అశ్వనీదత్ గార్లతో పనిచేయడం ఒకరకంగా కష్టమైన జాబ్! అయినా కంపోజర్స్ ఆలోచనలు వారు గౌరవిస్తారు. నా అభిప్రాయాలకు ఫ్రీడమ్ ఇస్తారు. ‘మహానటి’ తర్వాత ‘అన్నీ మంచి శకునములే’ లాంటి మంచి ప్రాజెక్ట్ నాకు వచ్చింది. ఇది రెండేళ్ళ క్రితమే మొదలైంది. పాండమిక్ కు ముందే వీటి గురించి పనిచేశాం. ఒక పాట చేశాక ఆరునెలలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కాలానుగుణంగా అది బోర్ అవుతుందేమోనని ఫీలింగ్ కలిగింది. అందుకే అప్పటినుంచి ప్రతి ట్యూన్ కోసం స్ట్రగుల్ పడ్డాం. కొత్త కొత్త ఆలోచనలకు తగినట్లుగా పనిచేశాం” అని అన్నారు. తరచూ చేసే విదేశీ ప్రయాణాల గురించి చెబుతూ, “నేను ఫిజికల్ గా దర్శక నిర్మాతలకు దగ్గరగా ఉండటం లేదనే ఫిర్యాదులు ఇంతవరకూ రాలేదు. నా వర్కింగ్ స్టయిల్ ‘హ్యాపీడేస్’లోనే కనిపిస్తుంది. నేను ఏ సినిమాకూ మ్యూజిక్ సిట్టింగ్ లో పాల్గొనలేదు. కేవలం ఫోన్ లోనే మాట్లాడుతుండేవాడిని. నేను కంపోజ్ చేసినవి దర్శకుడికి వినిపించేవాడిని. నా మ్యూజీషియన్ టీమ్ ఎక్కువగా లండన్, అమెరికాలలో వుంటుంటారు. వారికి నేను కాంటాక్ట్ లోనే వుంటాను. అందుకే నేను విదేశాల్లో వుండాల్సి వస్తుంది. ఇప్పటివరకు అలాగే చేస్తున్నాను” అని తెలిపారు.
సెలెక్టివ్ గా మూవీస్ చేయడం గురించి మాట్లాడుతూ, “ప్రారంభంలో కొంతకాలం అంటే పదేళ్లు అలా చేశాను. అప్పట్లో ఏడాదికి 4, 5 సినిమాలే చేసేవాడిని. ఫ్యామిలీ పిల్లల బాధ్యత ఉండేది. నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. అందుకే ప్రస్తుత పరిస్థితులను బట్టి గత రెండేళ్ల నుంచి ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. గ్రో అయ్యే కొద్దీ డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటా. ఒకరకంగా చెప్పాలంటే, నేను సినిమాలను ఎంపిక చేసుకోవడం లేదు. పీపుల్ నన్ను అలా కోరుకుంటున్నారు. బేసికల్ గా నాకు నాకు మెలోడీ అంటేనే ఇష్టం. వాటినే ఎంజాయ్ చేస్తాను. మిగతావి కొంచెం కష్టమైనవిగా అనిపిస్తాయి. మాస్ మూవీస్ “గద్దల కొండ గణేష్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” వంటి వాటికి నా బెస్ట్ ఇచ్చాను. కానీ మెలోడీ నేను వ్యక్తిగతంగా ఎంజాయ్ చేస్తాను. నేను మూడు గంటల పాటు ట్రావెల్ చేయాల్సివస్తే “కొత్తబంగారులోకం, హ్యాపీడేస్” పాటలు విని ఆనందిస్తాను. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అందుకే మెలోడీ ఎక్కువగా చేస్తుంటా. ఒకరకంగా చెప్పాలంటే మెలోడీ అనేది లాంగ్ టర్మ్ వుంటుంది. మాస్ కొద్దికాలం వరకు వుంటుంది” అని చెప్పారు. కొత్త కమిట్ మెంట్స్ గురించి వివరిస్తూ, “వరుణ్‌తేజ్ సినిమాలు రెండు చేస్తున్నాను. ఒకదానికి ప్రవీణ్ సత్తార్, మరో దానికి బాలీవుడ్ కి చెందిన శక్తి దర్శకులు. అలానే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లోనూ, దిల్ రాజు గారి ‘సెల్ఫిష్’ మూవీకి వర్క్ చేస్తున్నారు. స్వప్నగారి ‘ఛాంపియన్’ కూ నేను మ్యూజిక్ ఇస్తున్నాను. అమెరికన్ డైరెక్టర్ తో ఓ చిన్న సినిమాకూ వర్క్ చేస్తున్నాను” అని చెప్పారు.