కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలోని సాంబాపూర్, భైరాపూర్ గ్రామాలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు.
Read Also: Bengaluru: “సార్, నేను లవ్ జిహాద్, మతమార్పిడి బాధితురాలిని రక్షించండి”..
ఒక నాయకున్ని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలపకపోవడం బాధాకరం అని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి రాజకీయం సరైంది కాదు.. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదు.. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. కాగా సాంబాపూర్ గ్రామ ప్రజలు వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన ప్రజలు మరోసారి కేసీఆర్ ను గెలిపించేందుకు చూస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Read Also: Jabardasth Avinash: హీరోగా మరో జబర్దస్త్ కమెడియన్.. డైరెక్టర్ ఎవరంటే?