Ganja : తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోలీసుల కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే.. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు వేసి స్మగ్లర్ల ప్లాన్‌ను విచ్ఛినం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే.. ఏఓబీ ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి, బెంగూళూరు, గోవా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్‌ను ఎక్సైజ్, ఎన్ ఫోర్స్‌మెంట్ పోలీసులు ఎంతో శ్రమకు ఓర్చి పట్టుకున్నారు. 703 కేసుల్లో పట్టుబ డిన 7951 కేజీల గంజాయిని, డ్రగ్స్‌ను కాల్చేశారు. దహనం చేసిన గంజాయి, డ్రగ్స్ విలువ రూ.11,61,90,294 ఉంటుంది. తెలంగాణలోని ఎక్సైజ్ శాఖలోని పది జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో దాడులు నిర్వహించిన సమయంలో పట్టుబ డిన గంజాయి, డ్రగ్స్‌ను చాల కాలంలో స్టేషన్లలో భద్రపరిచారు. పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అదేశాలతో జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో నిల్వ చేసిన గంజాయిని, డ్రగ్స్‌ను దహనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆక్టోబరు నెలలో తెలంగాణలోని 10 జి ల్లాల్లో దాహన కార్యక్రమాలను మొదలెట్టారు.
అదిలాబాద్ జిల్లాలో 48 కేసుల్లో రూ. 1,02,98,875 విలువ చేసే 412 కేజీల గంజాయిని దాహనం చేశారు.
మెదక్ జి ల్లాలో 26 కేసుల్లో రూ.87,27,591 విలువ చేసే 107 కేజీలు,
నల్లగొండలో ఒక కేసులో రూ.11,76,500 విలువ చేసే 47 కేజీలు,
సూర్యపేట జి ల్లాలో 15 కేసుల్లో రూ. 21,65,100 విలువ చేసే 87 కేజీలు,
యాదాద్రి జి ల్లాలో 9 కేసుల్లో రూ.2,21,009 విలువ చేసే 12 కేజీలు,
ఖమ్మం జి ల్లాలో 237 కేసుల్లో రూ.1,88,08,299 విలువ చేసే 1120 కేజీలు,
కొత్తగూడెం జి ల్లాలో 34 కేసుల్లో రూ. 2,79,41,921 ఇలువ చేసే 1664 కేజీలు,
మేడ్చల్ మల్కాజి గిరి జి ల్లాలో 36 కేసుల్లో రూ. 25,14,275 విలువ చేసే 411 కేజీలు,
హైదారాబాద్ జి ల్లాలో 206 కేసుల్లో రూ. 2,15,56,240 విలువ చేసే 2167 కేజీలు,
సికింద్రాబాద్ పరిధిలో 91 కేసుల్లో రూ. 2,27,80,485 విలువ 1923 కేజీల గంజాయి, డ్రగ్స్, హషీస్ అయిల్, అల్పోజోలం, వీట్ అయిల్, ఓపీఎం, ఎండిఎంఎ లాంటి డ్రగ్స్‌ను దహనం చేశారు. చాల కాలంగా స్టేషన్లలో నిల్వ చేయబ డిన గంజాయి, డ్రగ్స్‌ను వెంటనే డిస్పోజల్ చేయాలని ఇచ్చిన అదేశాల మేరకు కొందరు ఎక్సైజ్ అధికారులు గంజాయిని వివిధ రూపాల్లో పట్టుబ డిన డ్రగ్స్‌ను దాహనం చేశారు. ఇంకా చాల జి ల్లాల్లో గంజాయిని, డ్రగ్స్‌ను దాహనం చేయాల్సి ఉంది. అన్ని జి ల్లాలో డిస్పోజల్‌పై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. ఈ నెలలో మిగిలిన జి ల్లాలో నిల్వ చేయబ డిన గంజాయిని, డ్రగ్స్‌ను గంజాయిని దాహనం చేయడానికి కసరత్తు జరుగుతుంది. ఇంకా రూ. 70 నుంచి రూ.75 కోట్ల విలువ చేసే గంజాయి, డ్రగ్స్ నిల్వ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.