Panchayat Elections : పంచాయితీ ఎన్నికలపై సర్కార్ కసరత్తు..!
- పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కసరత్తు
- డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం
- ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchayat Elections : తెలంగాణ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల నిర్వహణపై తర్జనభర్జనలో ఉంది. డెడికేషన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 2 లోపు ఈ నివేదిక సమర్పించబడుతుందని కమిషన్ హామీ ఇచ్చింది. నివేదిక అందిన వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలోనే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Venkatrami Reddy: గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Also Read
సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గురించి చర్చించబడింది. ఇంటింటి సర్వే విజయవంతంగా పూర్తయిందని గుర్తించిన సీఎం, దీని నిర్వహణలో భాగమైన అధికారులను అభినందించారు. అయితే, పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఏదైనా స్పష్టమైన నిర్ణయం వస్తుందని అనుకున్నప్పటికీ, ప్రభుత్వం ఇంకా తర్జనభర్జనలోనే ఉంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, ఈ రిజర్వేషన్లను అమలు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే, పాత విధానాన్ని కొనసాగించాలా లేదా కోర్టుల అనుమతి తీసుకుని రిజర్వేషన్ల శాతం పెంచాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోంది. న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
2024 ఫిబ్రవరి 1 న పంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికార పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం త్వరగా రిజర్వేషన్లపై స్పష్టత తీసుకొస్తే, 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
మొత్తం మీద, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేందుకు డెడికేషన్ కమిషన్ నివేదిక వేచిచూస్తోంది. రిజర్వేషన్ల వ్యవహారం, న్యాయపరమైన సమస్యలతో ప్రభుత్వం తర్జనభర్జనకు గురవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Central Cabinet Decisions: నేషనల్ క్రిటికల్ మిషన్‌కు కేబినెట్ ఆమోదం.. ఎన్ని కోట్లు కేటాయించారంటే..!
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!