Godi Energy : తెలంగాణలో గోడి ఇండియా భారీ ప్రాజెక్టు.. రూ.8 వేల కోట్ల పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ లో 12.5 GWh (గిగావాట్ ఫర్ అవర్ ) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
అదే వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో గోడి ఇండియా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. రాబోయే అయిదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి (R&D), గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి, రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు.
Also Read
- Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. "మిస్టర్ 10%" అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
- West Bengal: కాంగ్రెస్ నేత, కుమారుడి కాల్చివేత.. ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణం..
- Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
- Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
గోడి ఇండియా పెట్టుబడులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ లను ప్రోత్సహించటంతో పాటు పర్యావరణ అనుకూల వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అందుకు అవసరమైన విధానాలకు తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, పర్యావరణ వ్యవస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు అనుసంధానమై ఉందని, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ల రూపకల్పనలో గోడి కీలకంగా నిలుస్తుందని అన్నారు.
తమ కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి మహేష్ గోడి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యాపారాలకు సానుకూల వాతావరణంతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Rajasthan Crime: తాత హత్యకు దారితీసిన పెళ్లి వివాదం
-
Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ భేటీ.. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ పేసర్?
-
Top 5 Best-Selling Scooters in India: భారత్ లో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు.. టాప్‌లో యాక్టివా
-
West Bengal: కాంగ్రెస్ నేత, కుమారుడి కాల్చివేత.. ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణం..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?