Minister Seethakka Visits Utnoor Ashram School: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాదు ప్రతి గదికి వెళ్లి అక్కడి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.…