బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. సార్వత్రిక ఎన్నికల వేళ మేనిఫెస్టో తయారీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ అధిష్టానం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
పదేండ్లు తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయంపై దీక్ష చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దీక్ష చేపడతామని తెలిపారు.