Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Approves Indiramma Urban Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంత పేదలు, అల్పాదాయ వర్గాల సొంతింటి కల సాకారం చేసే దిశగా అడుగులు వేస్తూ ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన (EWS), అల్పాదాయ (LIG) వర్గాల కోసం 2-BHK (రెండు పడక గదుల) తరహాలో సరసమైన ధరల్లో నాణ్యమైన ఇళ్లను నిర్మించేందుకు ఈ ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ద్వారా ఈ సరసమైన పట్టణ గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా ప్రక్రియలను మరింత సులభతరం చేస్తూ గృహాల అనుమతుల్లో జాప్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
ఇందులో భాగంగా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక ‘సింగిల్ విండో కమిటీ’ (TGHB Affordable Urban Housing Single Window Committee) ని ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా అనుమతుల జాప్యం లేకుండా వేగవంతమైన సేవలు అందనున్నాయి. అలాగే నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ‘బిల్డ్‌నౌ వర్క్‌ఫ్లో’ (BuildNow Workflow) అనే ప్రత్యేకమైన అనుమతుల ప్రక్రియను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఇళ్లకు ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్ చార్జీల నుంచి ప్రభుత్వం పూర్తి మినహాయింపు ఇచ్చింది. ప్రణాళిక అనుమతులకు సంబంధించిన ఎలాంటి ఫీజులను వసూలు చేయవద్దని, వాటిని పూర్తిగా మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ విద్యాశాఖ/హౌసింగ్ బోర్డు ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాయితీలు, సులభతరమైన అనుమతుల ద్వారా పట్టణ పేదలకు నాణ్యమైన ఇళ్లను సకాలంలో, అందుబాటు ధరల్లో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?