తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. ఇటీవల హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయడం హైదరాబాద్ పెనుదుమారం రేపింది. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ముస్లింలు పలు పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే.. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే.. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించడంతో.. విచారించిన కోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్‌ను రద్దు చేసింది.
అయితే తాజాగా నాంపల్లి కోర్టు ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్ రిజెక్ట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పోలీసుల పిటిషన్ వేశారు. దీంతో విచారించిన హైకోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను సెప్టెంబర్ 16కి వాయిదా వేసింది హైకోర్టు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు.