NTV Telugu Site icon

TG High Court: గ్రూప్-1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Group 1

Group 1

గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. జీవో 29ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే, రిజర్వేషన్లు తేలేంతవరకు ఫలితాలు ప్రకటించకుండ ఆపాలని.. దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Read Also: Jani Master: పోలీసుల ఛార్జ్ షీట్.. జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే..!

హైకోర్టు తీర్పుతో గ్రూప్-1 ఫలితాలకు ఆటంకం తొలికింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. గ్రూప్-1 పరీక్షలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. చివరి నిమిషంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆఖరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయలేమని సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం సూచించింది.

Read Also: Hydropower Dam: చైనా చేష్టలతో భారత్కు పొంచి ఉన్న మరో ముప్పు..

Show comments