Jani Master: లైంగిక వేధింపుల కేసులో పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటూ వస్తున్న వార్తలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.. అందువల్లనే నేను బయటకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను అని పేర్కొన్నారు. త్వరలోనే క్లీన్ చీట్ తో బయటకు వస్తాను.. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే.. అప్పుడు నేను మాట్లాడతాను అని వెల్లడించారు. అసలు ఎం జరిగిందో నా అంతరాత్మకు, దేవుడికి తెలుసు అని జానీ మాస్టర్ పేర్కొన్నారు.
Read Also: Hydropower Dam: చైనా చేష్టలతో భారత్కు పొంచి ఉన్న మరో ముప్పు..
ఇక, నాకు తెలిసింది ఒక్కటే.. వచ్చిన విద్యతో కస్టపడి పని చేయడం అని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలిపారు. మీ అందరి దీవెనల వల్లనే నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను.. మీ అందరిని అలరించడానికి కష్టపడతాను.. మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది. దీనిపై ఆయన స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వీడియో రిలీజ్ చేశారు.