తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించిన గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీలు చేసిన నేపథ్యంలో, తాజాగా గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
గ్రూప్ 1 పిటీషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మెయిన్స్ జవాబు పత్రాలు పున:మూల్యాంకనం చేయాలని పిటీషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల లాయర్లు మెయిన్స్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటున్నారు. పిటీషన్లపై ఈ రోజు వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది. ఏప్రిల్‌లో జరిగిన విచారణ సందర్బంగా గ్రూప్1 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. నియామకాలపై…
Group-1 Exam: గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ వన్‌లో నిలిచింది. 52 మంది 500 కు పైగా మార్క్ లు సాధించారు.
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్‌ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్…
Group1 Results: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్-1 ఫలితాలు ఈ రోజు (సోమవారం) విడుదల కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తరువాత ఇవే మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు కావడం విశేషం. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 563 పోస్టులకు గానూ, 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. 563…
తెలంగణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్ 1,2,3 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు రిజల్స్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారికి టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. గ్రూప్ 1,2,3 పరీక్షల ఫలితాల విడుదల తేదీలను ఫిక్స్ చేసింది. ఈరోజు జరిగిన సమావేశంలో టీజీపీఎస్సీ కమిషన్ పెండింగ్ లో ఉన్న అనేక నోటిఫికేషన్ల స్టేటస్ పై సమీక్షించి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్/ ఫలితాల ప్రకటన…
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. జీవో 29ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.