Hydropower Dam: ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్‌ను నిర్మించడానికి చైనా ఆమోదించింది. టిబెట్ తూర్పు అంచులో యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించబోతున్నట్లు అక్కడి న్యూస్ ఛానల్స్ లో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో డ్రాగన్ కంట్రీకి చెందిన పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ పేర్కొనింది. ప్రస్తుతం చైనాలో త్రీగోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్ గా ఉంది. అంటే కొత్తగా నిర్మించే జలాశయం సామర్థ్యం దానికి మూడురెట్లు అధికంగా ఉండనుందని సమాచారం.
Read Also: Potina Mahesh: కాపుల కోసం పోరాడవా?.. వంగవీటి రాధాపై పోతిన మహేష్ ఫైర్!
కాగా, టిబెట్‌లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదీ జలాల ప్రవాహతీరు, పంపిణీ లాంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్-చైనా మధ్య ఇప్పటికే ఒప్పందం కొనసాగుతుంది. వర్షాకాలంలో ఈ నదికి భారీగా వరదలు వస్తాయి. బంగ్లాదేశ్‌లో తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంటుంది. అయితే, ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జల సంబంధిత విషయాల్ని చైనా- భారత్ పంచుకోవాల్సి ఉంటుంది.
Read Also: Delhi: ఢిల్లీ ఎన్నికలకు.. ఆప్- కాంగ్రెస్ మధ్య పోరు..
అయితే, చైనా- భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్‌కు ఇవ్వడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకున్నారు.. కానీ, చివరి సారిగా కుదిరిన ఒప్పందం 2023లో క్లోజ్ అయింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల ఆ తర్వాత కొత్త ఒప్పందం చేసుకోలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా రెడీ అవుతుండటం భారత్ ను కలవరపాటుకు గురి చేస్తుంది.
Read Also: AUS vs IND: ఐసీసీ కీలక నిర్ణయం.. కోహ్లీకి భారీ జరిమానా
ఇక, చైనా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్‌కు ప్రమాదం పొంచి ఉన్నట్లే. వేసవిలో బ్రహ్మపుత్ర నది నీటిని మళ్లించేందుకు బీజింగ్‌కు ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కునే ప్రమాదం ఉంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్రకి భారీగా వరదలు వస్తుంటాయి.. ఒకేసారి నీటిని కిందికి విడుదల చేస్తే.. దిగువనున్న ప్రాంతాలు ముంపుకు గురికానున్నాయి. ఈ ప్రాజెక్ట్ భారత్-చైనా సరిహద్దుకు కేవలం 30 కిలో మీటర్ల దూరంలోనే నిర్మిస్తున్నారు. దాంతో పాటు రక్షణ పరంగానూ భారత్‌కు అనేక సమస్యలు వస్తాయి. ఒక వేళ యుద్ధ పరిస్థితులు వస్తే.. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా ఒకేసారి వాటర్ బాంబ్‌గా ఉపయోగించే అవకాశం కూడా ఉంది.