తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ వన్‌లో నిలిచింది. 52 మంది 500 కు పైగా మార్క్ లు సాధించారు.
గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. డిసెంబర్ 2022 లో 1388 పోస్ట్ భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదలవగా.. 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) పరీక్ష రాశారు. ఫలితాలతో పాటే ఫైనల్ కీ, అభ్యర్థుల లాగిన్ ఐడీలకు OMR షీట్స్ కూడా పంపించారు.…
Uttam Kumar Reddy : జనవరి మాసాంతానికి నీటిపారుదల శాఖలో పదోన్నతులు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే క్రమమంలో బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సులననుసరించి.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి బదిలీలు చేస్తామన్నారు. దశాబ్దాకాలంగా నీటిపారుదల శాఖ గాడి తప్పిందన్నారు మంత్రి ఉత్తమ్. ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం జరిగిందని, నీటిపారుదల శాఖా బడ్జెట్ లో 11000 వేల కోట్లు అప్పులకు, వడ్డీలకే సరిపోతుందన్నారు. సంవత్సర కాలంగా శాఖాను గాడిలో…
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. జీవో 29ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.
తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక అప్‌డేట్ అందించింది. నవంబర్ 17 , 18 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలకమైన సమాచారాన్ని అందించింది. 2024, అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు 2024, అక్టోబర్ 14 నుండి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, అభ్యర్థులు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే, టోల్…