Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodar Rajanarsimha: డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. తమ నైపుణ్యం ద్వారా ప్రతి రోజూ వేల ప్రాణాలను డాక్టర్లు కాపాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, వారి సేవలు ఆరోగ్య వ్యవస్థకు ఎంతో కీలకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్య సౌకర్యాలు, తగిన మానవ వనరులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 440 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, సుమారు 800 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. డాక్టర్లతో పాటు ఇతర పోస్టులను కూడా పెద్ద సంఖ్యలో భర్తీ చేశామని చెప్పారు. సుమారు 15 వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డెంటిస్టుల ఆకాంక్షను నెరవేర్చుతూ 48 డెంటల్ సర్జన్ పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు.
ఈ రెండున్నర సంవత్సరాల్లో సుమారు 1,300 మంది డాక్టర్లకు పదోన్నతులు కల్పించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. డాక్టర్ల దశాబ్దకాల ఆకాంక్ష అయిన ఉస్మానియా నయా హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, అలాగే గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో నూతన హాస్టళ్ల నిర్మాణం పూర్తికావొచ్చిందని మంత్రి తెలిపారు. వైద్యులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందికి మెరుగైన వర్క్ ఎన్విరాన్మెంట్ కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలను 15 శాతం మేర పెంచామని మంత్రి గుర్తు చేశారు. అద్దె భవనాలు, పాత భవనాల్లో కొనసాగుతున్న మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆధునిక భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ వైద్యుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యులు తమ సేవలను కొనసాగించాలని కోరుతూ, డాక్టర్స్ డే సందర్భంగా మరోసారి రాష్ట్రంలోని వైద్యులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!