Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన పర్యటనలో ఒక మానవీయ కోణం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడులో తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని, అక్కడి నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి తిరుగుప్రయాణమైన మంత్రి కాన్వాయ్ మార్గమధ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతం గుండా వెళుతోంది. ఆ సమయంలో ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వెలుపల బడి ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్న విద్యార్థులు రోడ్డు పక్కన వేచి ఉండటాన్ని మంత్రి నారా లోకేష్ గమనించారు. వెంటనే తన కాన్వాయ్ను ఆపాలని ఆదేశించి, తన వాహనం నుంచి కిందకు దిగి నేరుగా ఆ విద్యార్థుల దగ్గరకు వెళ్లారు.
పిల్లలను ఎంతో ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను ఆరా తీశారు. పాఠశాలలో ప్రభుత్వం తరఫున అందిస్తున్న మధ్యాహ్న భోజనం, చిక్కీ నాణ్యత ఏ విధంగా ఉందంటూ విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి అడిగిన ప్రశ్నకు విద్యార్థులు స్పందిస్తూ, గతంతో పోలిస్తే ఇప్పుడు పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం చాలా రుచికరంగా, నాణ్యతా ప్రమాణాలతో కూడుకుని ఉందని సమాధానం ఇచ్చారు.
Also Read
పిల్లల మాటలు విని సంతోషం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్, వారి చదువుల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి బాగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనుకోని విధంగా మంత్రి తమను పలకరించి, తమతో సరదాగా మాట్లాడటంతో ఆ పాఠశాల విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి నిరుపేద విద్యార్థుల పట్ల చూపిన ఈ ప్రత్యేక చొరవ, సామాన్య ప్రజలతో మమేకమయ్యే ఆయన నాయకత్వ శైలి స్థానికంగా ఎంతగానో ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ చిన్న సంఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!