స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా ను లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ యూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీ గా ఉంది..విజయ్ దేవరకొండ గత చిత్రం లైగర్ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నిరాశ చెందారు. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ఖుషి సినిమాపైనే వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఖుషి సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి.
తాజాగా ఖుషి సినిమా సెన్సారు ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘165 నిమిషాల నిడివి తో గల ‘ఖుషి’ సినిమా మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధంగా వుందని తెలియ జేశారు.. అయితే ఈ సినిమా రన్ టైమ్ బయిటకు వచ్చాక అభిమానులు కొద్దిగా కంగారుపడుతున్నారు. రెండు గంటల నలభై ఐదు నిముషాలు పాటు సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఏ మాత్రం తేడా కొట్టినా మొత్తం రన్ టైమే సినిమాకు సమస్య గా మారవచ్చు..చాలా సినిమాలకు రన్ టైమ్ ఎక్కువ కారణంగా భారీ విజయం అందుకోలేక పోయాయాని దీనితో ఖుషి సినిమా విషయం లో కూడా అదే జరుగుతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.మరి ఫ్యాన్స్ భయాలను దాటుకొని ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.