రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విజయ్ దేవరకొండకు యూత్ లోభారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ మొదటి హిట్ ను అందుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. వరుసగా స్టార్ దర్శకులతో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.ఇది ఇలా ఉంటే గత ఏడాది విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధిస్తుంది అని మూవీ మేకర్స్ ఊహించారు.. కానీ ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది.. లైగర్ మూవీ తర్వాత విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ఖుషి.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి.. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మరియు పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తరువాత దర్శకుడు గౌతమ్ తిన్నూరి తో సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటి శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తనకు గీతా గోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ తో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో హాట్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. విజయ్‌తో నిర్మాత దిల్ రాజు కొత్తగా పాన్-ఇండియన్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం..ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.