Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు తీవ్రత మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
Also Read: Fake IAS: నకిలీ ఐఏఎస్ అధికారిణిని గుర్తించాం.. కఠిన చర్యలు తీసుకుంటాం: విశాఖ సీపీ
ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా, కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారు కాగా, గ్రహితులు బెంగళూరుకు చెందినవారిగా గుర్తించబడ్డారు. కేసులో అత్యంత తీవ్రమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారం గత ఆరు నెలలుగా అలకనంద ఆస్పత్రిలో జరుగుతున్నట్లు విచారణలో తెలుస్తోంది. ఒక్కో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు 50 లక్షలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రాకెట్ వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
Also Read: Gopichandh Malineni : సన్నీ డియోల్ ‘JAAT’ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఈ ఘటనా తరువాత, రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, కిడ్నీ రాకెట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తును చేపట్టే ప్రక్రియలో ఉన్నారు. అలకనంద కిడ్నీ రాకెట్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. దీనిపై త్వరలో మరిన్ని పరిణామాలు వెలుగులోకి రానున్నాయి.