శాసన సభ ఎన్నికలకు రేపే నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు 11 గంటల నుండి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుండి 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ. నామినేషన్ స్వీకరణకు 10వ నవంబర్ చివరి గడువు.. కాగా.. ఈ నెల 13న నామినేషన్ల స్కృటీని ఉంటుంది. ఈ నెల 15వరకు నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు అని, ఈ నెల 30న పోలింగ్ అన్నారు. వచ్చే నెల 3న ఓట్ల కౌంటింగ్ అని ఆయన అన్నారు.
Also Read : Jasprit Bumrah: ప్రపంచకప్లో మరో రికార్డ్.. తొలి బంతికే ఘనత సాధించిన స్టార్ బౌలర్
జనరల్, బీసీ అభ్యర్థుల డిపాజిట్ 10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 వేల డిపాజిట్ అన్నారు. ఆర్వో కార్యాలయ వద్ద భద్రత కట్టుదిట్టమన్నారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ఐదుగురికి మాత్రమే లోపలికి అనుమతి అని ఆయన అన్నారు. ఆర్వో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, ర్యాలీలు, సభలు నిషేధమన్నారు. రేపటి నుండే అభ్యర్థి ఖర్చును లెక్క కట్టనున్న వ్యయ పరిశీలకులు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Jasprit Bumrah: ప్రపంచకప్లో మరో రికార్డ్.. తొలి బంతికే ఘనత సాధించిన స్టార్ బౌలర్