Shikha Goel : సైబర్ క్రైమ్‌పై గణనీయమైన అణిచివేతలో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రాష్ట్రవ్యాప్తంగా 48 మంది వ్యక్తులను స్థానిక పోలీసుల సమన్వయంతో అరెస్టు చేసింది. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు, మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు TGCSB స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ నిర్వహించామని, సైబర్ నేరగాళ్ళకు మ్యూల్ అకౌంట్లను సమకూర్చే వారిని అరెస్టు చేసామన్నారు. 508 కేసుల్లో భాగస్వాములుగా ఉన్నా 48 మంది నిందితులను అరెస్టు చేశామని, నిందితులకు దేశవ్యాప్తంగా 2194 కేసుల్లో పాత్ర ఉందని ఆమె తెలిపారు. నిందితులు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు బాధితుల నుండి కొల్లగొట్టడానికి సైబర్ నేరగాలకు సహకరించారని, అరెస్ట్ అయినా వారిలో 38 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు. 10 మంది ఏజెంట్లు ఉన్నారన్నారు. ఏజెంట్లు ఆధార్ పాన్ కార్డు తీసుకుని ఖాతాలు ఓపెన్ చేస్తారని, ఆయా ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారన్నారు.
YS Jagan: మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..?
అంతేకాకుండా..’సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడి కొల్లగొట్టిన డబ్బును ఆ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మ్యూల్ అకౌంట్లు సమకూర్చి పట్టుబడ్డ వారిలో విద్యావంతులు ఉన్నారు. ఈ మ్యూల్ అకౌంట్ హోల్డర్లందరూ తెలంగాణతో పాటు దేశంలో కూడా పలు కేసుల్లో చిక్కుకున్నారు. ఈ 48 మంది అరెస్టయిన వ్యక్తులలో క్యాబ్ డ్రైవర్లు, చిన్న వ్యాపార యజమానులు ఉన్నారు. 22 మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉన్నారు. నిందితుల వద్ద నుండి 53 మొబైల్ ఫోన్లు. 4 ల్యాప్‌టాప్‌లు, 5 సీపీయూలు, 2 మానిటర్లు.. 18 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 16 చెక్ బుక్‌లు, 10 ఏటీఎం కార్డులతో పాటు ఇక బైక్ స్వాధీనం చేసుకున్నాం.. నిందితులు ట్రై కమిషనరేట్ పరిధితో పాటు నిజామాబాద్, రామగుండం ప్రాంతాలలో జరిగిన నేరాలకు మ్యూల్ ఖాతాలు ఇచ్చారు.. సైబర్ నేరగాళ్ల కోసం ముందుగా రాజస్థాన్ లో మొదటిసారి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాం.. ముందుగా ఇద్దరు మ్యూల్ అకౌంట్ హోల్డర్ లను పట్టుకున్నం. వారిని విచారిస్తే డొంక కదిలింది.. సైబర్ నేరగాళ్లకు, బ్యాంక్ అకౌంట్ సమకూర్చే ఏజెంట్ లకు పరిచయం ఉండదు.. వీరంతా టెలిగ్రాం,లాంటి సోషల్ మీడియా యాప్ ల ద్వారా మాట్లాడుకుంటారు..’ అని శిఖా గోయల్ తెలిపారు.
Most Expensive Rice: భూమి మీద అత్యంత ఖరీదైన బియ్యం ఎక్కడ పండిస్తారంటే? ఒక్క కిలో ధర ఏకంగా వేలల్లో..