అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్న ఒక భారీ మోసాల గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB), టెలికమ్యూనికేషన్ శాఖ సంయుక్తంగా చంద్రాయణగుట్టలో జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు.
ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు, మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు TGCSB స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు.
ఒక హ్యాకర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాక్-ఐ అప్లికేషన్ డేటాను దొంగిలించాడు. చీకట్లో ఉన్న అతని చర్యలు కాస్తా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు హ్యాకర్‌ను గుర్తించి, ఢిల్లీలో అరెస్ట్ చేసి, ప్రత్యేక బృందాలతో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. TGCSB అధికారులు సాంకేతికతను ఉపయోగించి, దొంగిలించిన డేటాను $150కు విక్రయించినట్టు గుర్తించి, హ్యాకర్ స్థలాన్ని ట్రేస్ చేశారు. ఈ హ్యాకర్‌కు క్రిమినల్ హిస్టరీ కూడా ఉండటంతో, పోలీసులు అతన్ని పట్టుకోవడంలో సవాళ్లను అధిగమించారు.