CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తీసుకున్న నూతన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి అంశంలోనూ చట్టం ప్రకారమే పాలన సాగిస్తూ, ప్రజలకు సంపూర్ణ జవాబుదారీతనంతో సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆహార పదార్థాలు, నిత్యవసర ఔషధాల నాణ్యతను, భద్రతను పర్యవేక్షించేందుకు ఏకీకృత వ్యవస్థగా ‘తెలంగాణ సేఫ్’ (TG-Safe – తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) ను అమలులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు ఈ నూతన అథారిటీ ద్వారా కఠిన ప్రమాణాలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు.
Also Read
- AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
- MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
Our People’s Government has placed a premium on safety, security and well-being of citizens in every aspect of life.
Establishing and reiterating rule of law and making accountability our deepest commitment.
Today, as Telangana Standards Authority for Food and Essential Drugs…
— Revanth Reddy (@revanth_anumula) August 17, 2026
దీని ద్వారా మార్కెట్లో లభించే ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించడం, నకిలీ , ప్రమాదకర మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు పెరిగి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా పౌరులకు సురక్షితమైన ఆహారం, సమర్థవంతమైన మందులు అందుబాటులోకి వచ్చి, ప్రజారోగ్యానికి సంపూర్ణ భద్రత చేకూరుతుంది.
నాణ్యమైన ఆహారం, సురక్షితమైన మందులు అందించడమే లక్ష్యంగా పనిచేసే ‘TG-Safe’ సేవలను ఉపయోగించుకుంటూ, ఆరోగ్యవంతమైన, సురక్షితమైన తెలంగాణ నిర్మాణంలో రాష్ట్ర పౌరులందరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!