తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో పీసీసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు అయింది. రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్ట్.. రేవంత్ రెడ్డికి హాజరు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: Mahesh Kumar Goud: వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అదే!
మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సృజన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు పీపీని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది.