Gaddam Prasad Kumar: తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాను కొందరు హాకింగ్ గురి చేశారు. ఈ హ్యాకింగ్ జరిగిన సమయంలో హ్యాకింగ్ చేసినవారు కొన్ని వీడియోలను, పోస్టులను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్పీకర్ టెక్నికల్ టీం వెంటనే అందుకు సంబంధించిన తగిన చర్యలను తీసుకోంది. దాంతో పరిస్థితిని టెక్నికల్ టీం అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఓ ట్వీట్ చేశారు.
Nara Rohith: మీది కూడా ‘మూలా నక్షత్రమా’.. అయితే సుందరకాండ చూడాల్సిందే..
ఇందులో ఆయన.. ” సూచన అంటూ.. ఈరోజు ఉదయం నా వ్యక్తిగత X (TWITTER) కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయింది. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారు. నా X హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
సూచన..
ఈరోజు ఉదయం నా వ్యక్తిగత X (TWITTER) కొంత సమయం హ్యాకింగ్ (Hacking) అయింది. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారు.నా X హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను pic.twitter.com/blgsgfAdjV
— Gaddam Prasad Kumar (@GpkOfficial_) August 26, 2024