NTV Telugu Site icon

Uttam Kumar Reddy : దళిత స్పీకర్‌ను అవమానపరిచేట్లు మాట్లాడడం సరికాదు

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్, ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి ప్రత్యేకమైన గౌరవం, అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు. “ఒక సభ్యుడు స్పీకర్‌పై ఇంత అహంకారంగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. దీన్ని సాధారణంగా తీసుకోవడం తగదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, జగదీష్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

CM Chandrababu: విద్యుత్తు రంగంలో ఎన్నో సంస్కరణలు టీడీపీ తెచ్చింది..

అంతకుముందు సభలో మాట్లాడిన జగదీష్ రెడ్డి, “మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డవారమే. మీరూ మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు,” అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాటలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ, “స్పీకర్‌ను బెదిరించడం, ఆయన పదవిని అపహాస్యం చేయడం సరైనది కాదు. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలి,” అని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వివాదం అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులను తీసుకువచ్చింది, స్పీకర్‌ గౌరవాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

IPL 2025: అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడానికి కారణం అదే: వెంకీ