Telangana : వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..లారీని ఢీ కొట్టిన కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రెండ్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నాడని అతనికి వీడ్కోలు చెప్పి తిరిగి వస్తుండగా మృత్యువు కబలించింది..ఈ విషాదకర ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిలోని కోమళ్ల టోల్గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. అమెరికాకు వెళ్తున్న తమ మిత్రుడికి సెండాఫ్ ఇచ్చేందుకు వరంగల్‌కు చెందిన రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి బొలెరోలో హైదరాబాద్‌కు వెళ్లారు. పెంబర్తి రిసార్ట్‌లో రాత్రంతా స్నేహితుడితోనే ఉండి.. శనివారం ఉదయం 5 గంటలకు తిరిగి హన్మకొండకు బొలెరోలో బయలు దేరారు..
అయితే తెల్లవారుజామున ట్రాఫిక్ లేకపోవడంతో కాస్త వేగంగానే వచ్చారు.. అదే వారిని డైరెక్టర్ గా మృత్యువు ఒడిలోకి తీసుకెళ్ళింది..కోమళ్ల టోల్గేట్ సమీపంలోని ఓ మలుపు వద్ద రోడ్డు మీదే లారీ పార్క్ చేసి ఉంది. దాన్ని గమనించకపోవటంతో.. వేగంగా వచ్చిన బొలేరో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో.. బొలేరో వాహనం.. లారీ కిందికి చొచ్చుకుపోయి.. ముందుబాగమంతా నుజ్జునుజ్జయింది. కాగా.. ముందు సీట్లలో ఉన్న రాకేశ్ చంద్ర గౌడ్, సందీప్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..
Also Read
మృతదేహాలను బయటకు తీసి జనగామ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. హన్మకొండ గాంధీనగర్‌కు చెందిన రాకేశ్ చంద్ర గౌడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. రాకేశ్‌కు భార్య, 9 నెలల బాబు ఉన్నాడు. అలాగే.. నయీంనగర్‌కు చెందిన సందీప్ బీటెక్ చదివి బిల్డర్‌గా కొనసాగుతున్నాడు. సందీప్‌కు భార్య, 18 నెలల చిన్నారి ఉంది. ఈ ఘటన తెలిసి.. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.. చిన్న పిల్లలు ఉండటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా స్థానికులు చెప్తున్నారు. ఈ మార్గంలో లారీలు నిబంధనలకు విరుద్దంగా.. ఇష్టారీతిన రోడ్డు మీదే ఆపేస్తున్నారని అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు..
తాజావార్తలు
-
శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
-
Psychology facts: అర్థరాత్రి.. నిద్రపోని మనసు.. సముద్రంలో అలల్లా ఎగసిపడుతున్న ఆలోచనలకు కారణం ఇదే!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!