Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేక రిస్క్‌గా మారుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేజ సజ్జా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యాడు. స్ట్రాటజీ, మైండ్ గేమ్స్, డిసెప్షన్‌తో సాగిపోయే ఈ షోలో 20 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. ఈ షోతో తేజ కొత్త అవతార్‌లో కనిపించబోతున్నాడు. జాంబిరెడ్డి, హనుమాన్ మిరాయ్ తో హాట్రిక్ హిట్ అందుకున్న హీరోగా తేజ సజ్జా టాలీవుడ్ లో సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. ఈ సమయంలో రియాలిటీ షో హోస్టింగ్ వైపు రావడం ఒక స్ట్రాటజిక్ స్టెప్‌గా కనిపిస్తోంది. సినిమాలకే పరిమితం కాకుండా వేరే ప్లాట్‌ఫామ్స్‌లో కూడా తన ప్రెజెన్స్ పెంచుకోవాలనే ప్రయత్నంగా తేజ సజ్జా ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.
Also Read : Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
అయితే హీరోగా హనుమాన్ రూ. 200 కోట్లకు పైగా, మిరాయ్ రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తేజ సజ్జా మార్కెట్ పెంచాయి. స్టార్ హీరోగా సెటిల్ అవుతున్న టైమ్‌లో రియాలిటీ షోస్ చేయడం కొంత రిస్క్ కూడా. హోస్టింగ్‌లో ఆడియన్స్ కనెక్ట్ కాకపోతే అది తన సినీ కెరీర్ లో వస్తోన్న ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సక్సెస్ అయితే మాత్రం తేజకు కొత్త ఆడియన్స్ బేస్ కూడా క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం తేజసజ్జా లైనప్ విషయానికి వస్తే జై హనుమాన్ జాంబీ రెడ్డి 2 మిరాయ్ 2 లాంటి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు మరోవైపు ఓటీటీ షో ఇలా రెండు ప్లాట్‌ఫామ్స్‌లో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లబోతున్నాడు. మొత్తానికి తేజ సజ్జా ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నాడు. ఈ రియాలిటీ షో ఆయన కెరీర్‌కు కొత్త దారులు తీసుకువస్తుందా లేక సినిమాలపైనే ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!