Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలన్‌గా మొదలై… హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సీనియర్ స్టార్… ప్రస్తుతం కెరీర్‌లో కొంత డల్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్నాడు. సైడ్ రోల్స్‌కి షిఫ్ట్ అయి సాలిడ్ కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నాడు మోహన్ బాబు నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా “ది ప్యారడైజ్”లో మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ అనే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. రగ్గడ్ లుక్, గన్, కత్తి, సిగార్‌తో ఆయన లుక్ ఇప్పటికే ఇంటెన్స్ వైబ్ క్రియేట్ చేసింది. ఈ పాత్ర కథలో కీలకమని మోహన్ బాబు నటనలో మరో కోణాన్ని చూపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ఇంకా… అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న “శ్రీనివాస మంగాపురం” సినిమాలో వెంకటప్ప నాయుడు పాత్రలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో రాషా తడానీకి తండ్రిగా కనిపించబోతున్నాడు.
Also Read : NBK 112 : బాలయ్య – వివేక్ ఆత్రేయ సినిమా కోసం ఇద్దరు టాప్ టెక్నిషియన్స్
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఒకప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యాక్షన్ హీరో డా. రాజశేఖర్… ప్రస్తుతం కెరీర్‌లో క్లియర్ రూట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. “పీఎస్వీ గరుడ వేగ” తర్వాత ఆయన నుంచి 2.0 వెర్షన్ వస్తుందని అనుకున్నా గ్రాఫ్ పడిపోవడంతో ఆగిపోయింది. జగపతిబాబు, శ్రీకాంత్‌లా విలన్ రోల్స్‌లో స్థిరపడలేకపోయాడు. అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్‌తో కనిపిస్తున్నా… పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ కావడంలేదు. 2023లో “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్”లో స్పెషల్ రోల్ తర్వాత… సరైన క్యారెక్టర్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.. లేటెస్ట్ గా శర్వానంద్ నటిస్తున్న “బైకర్” సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘బుల్లెట్ సునీల్’ అనే మాజీ మోటోక్రాస్ రేసర్‌గా… హీరోకి ట్రైనర్‌గా పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రాజశేఖర్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. మొత్తానికి… ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఈ ఇద్దరు సీనియర్ హీరోలు… ఇప్పుడు పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌తో మళ్లీ మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారు. మరి ఈ సినిమాలైనా మోహన్ బాబు, రాజశేఖర్‌లకు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!