IND vs NZ: టీమిండియా పరాజయం.. కోహ్లీపై విపరీతమైన ట్రోల్స్
- కివిస్ అద్భుత విజయం
- సొంత గడ్డపై భారత్ ఘోర పరాజయం
- 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్
- టీమిండియా ఓటమి తర్వాత విపరీతమైన ట్రోల్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆదివారం ముగిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. భారత గడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా సొంత గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసి భారత్‌కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో.. భారత జట్టు 29.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమి తర్వాత టీమిండియాపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై కామెంట్స్ చేస్తున్నారు.
Constable who shot SI: సర్వీస్ రైఫిల్‌తో ఎస్సైని కాల్చి చంపిన కానిస్టేబుల్.. కారణం?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవమైన ప్రదర్శన చూపించారు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో వీరిద్దరు పరుగుల కోసం ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్టుల్లోనూ రోహిత్ శర్మ కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్టులో 2, 52 పరుగులు చేయగా.. రెండో టెస్టులో 0, 8 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టుల్లో 18, 11 పరుగులు చేశాడు. కోహ్లీ మూడు టెస్టుల్లో కలిపి 93 పరుగులు చేశాడు. తొలి టెస్టులో 0, 70.. రెండో ఇన్నింగ్స్ లో 1, 17.. మూడో టెస్టులో 4, 1 పరుగులు చేశాడు. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లడంపై మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ అక్కడికి వెళ్లడమే మంచిదని జనాలు అంటున్నారు. తన వికెట్ పడే వరకు ఉన్నాడు, ఆ తర్వాత ఔట్ కాగానే లండన్‌కు బయలుదేరాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మను కూడా ట్రోల్ చేస్తున్నారు.
#INDvNZ
Virat Kohli Jets Off To London After His Wicket 🛫 pic.twitter.com/CJtKYxUTtj— Prof cheems ॐ (@Prof_Cheems) November 3, 2024
Joke ❌ Reality ✅ #INDvNZ #retired Retire Virat Kohli Rohit Sharma Sarfaraz Test Cricket Indian Cricket Team pic.twitter.com/6UOm82bwv8
— Ashish Vishwakarma (@ashisvi) November 3, 2024
Omar Abdullah: ఉగ్రదాడిపై స్పందించిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?