NTV Telugu Site icon

Team India: టీమిండియా అద్భుత బ్యాటింగ్.. పాక్ మాజీ కెప్టెన్ పొగడ్తల వర్షం..

Misba

Misba

ఇంగ్లాండ్ పై టీమిండియా ఆదివారం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 100 పరుగుల తేడాతో భారత్ విక్టరీ సాధించింది. భారత్ ఈ మ్యాచ్ లో గెలవడానికి గల కారణం.. బ్యాటింగ్, బౌలింగ్ బలంగా ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఆరంభంలోనే ఒక వికెట్ కోల్పోయినప్పటికీ, కెప్టెన్ రోహిత్ శర్మ 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తనతో పాటు సూర్యకుమార్ యాదవ్ మెరుగ్గా ఆడాడు. ఒకానొక సమయంలో భారత్ తక్కువ స్కోరు చేసింది కదా.. అందరు క్రికెట్ అభిమానులు ఓడిపోతుందని అనుకున్నారు.

Read Also: Chhattisgarh Assembly Election 2023: నామినేషన్‌ దాఖలు చేసిన చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్

కానీ లక్నో పిచ్ తీరు తెలిసిన ఫ్యాన్స్ టీమిండియా గెలుస్తుందని ధీమాగానే ఉన్నారు. చివరికి అనుకున్నట్లుగానే భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా గెలుపుపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ .. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘లక్నో పిచ్ పై భారత్ అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా వికెట్లు పడుతున్నా కూడా తన ఆటను కొనసాగించింది. ఈ తరహా ధైర్యాన్ని చూపించడం, బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడం కష్టమైన విషయం’’ అని మిస్బా చెప్పుకొచ్చాడు.

Read Also: MLA Laxma Reddy : మంచి చేసిండు.. మళ్ళీ బరాబర్ వస్తడు

ముఖ్యంగా రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగి ఒక కీలక ఇన్నింగ్స్ ఆడటం వల్లే.. భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగిందని అన్నాడు. మూడు వికెట్లు వరుసగా కోల్పోయినా.. రోహిత్ నిలకడగా ఆడిన తీరు అద్భుతంగా ఉంది’’ అని మిస్బా పేర్కొన్నాడు. పిచ్ కండిషన్లను అర్థం చేసుకుని, భారత బ్యాటింగ్ లైనప్ అందుకు తగ్గట్టుగా ఆడిందని తెలిపాడు. ఓవరాల్ గా టీమిండియా ఆటను నాణ్యమైన ఇన్నింగ్స్ గా అభివర్ణించాడు.