NTV Telugu Site icon

IND vs BAN 3rd T20: భారత్‌ ఊచకోత.. అంతర్జాతీయ టీ20లో భారత్‌ అత్యధిక స్కోర్

Sanju

Sanju

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. అంతర్జాతీయ టీ20లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్‌ ఇండియాకు శుభారంభం అందించాడు. శాంసన్ సెంచరీ 40 కేవలం బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 13.4 ఓవర్ వద్ద ముస్తాఫిజుర్ బాలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మొత్తం 47 బంతుల్లో 111 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. అంతర్జాతీయ టీ20ల్లో సంజుకు ఇది తొలి సెంచరీ. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతంగా రాణించాడు. కెప్టెన్ 34 బాల్స్‌లో 75 రన్స్ చేశాడు. మహ్మదుల్లా బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్‌ క్యాచ్ ఓటయ్యాడు. రియాన్ పరాగ్ 34 పరుగులు చేసి ఓటయ్యాడు. హార్దిక్ పాండ్యాకు ఆఫ్ సెంచరీ మిస్ అయ్యింది. 18 బాల్స్‌లో 47 రన్స్ పూర్తి చేసి వెనుదిరిగాడు.

READ MORE: BJP: టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ఇలాగే మాట్లాడుతుంది.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ టీ20లో అత్యధిక స్కోర్ చేసింది భారత్.. టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ మధ్య 16 టీ20 మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 15 మ్యాచ్‌లు గెలిచింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో మాత్రమే కైవసం చేసుకుంది. 2019లో భారత్‌పై బంగ్లాదేశ్‌ ఏకైక విజయం సాధించింది. అప్పుడు బంగ్లాదేశ్ ఢిల్లీలో భారత్‌ను ఓడించింది. హైదరాబాద్‌లో ఇది మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. ఇంతకు ముందు ఇక్కడ వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో ఆడిన భారత్ రెండిటిలో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లోనూ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ విజయం సాధించింది. కాగా.. ఈరోజు టీమిండియా కొత్త ఫినిషర్ రింకూ సింగ్ పుట్టినరోజు. రింకూ పుట్టినరోజు సందర్భంగా భారత జట్టు అతడికి ఈ భారీ విజయాన్ని కానుకగా అందించాలని చూస్తోంది.

READ MORE:US Presidential Elections: అమెరికా అధ్యక్షుడుని గెలిపించేవి ఈ 7 స్వింగ్ స్టేట్స్.. ట్రంప్, కమలా హారిస్ మధ్య టైట్ ఫైట్..

భారత టీం: సంజు శాంసన్ (WK), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా/జితేష్ శర్మ, ర్యాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

బంగ్లాదేశ్ టీం: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిటన్ దాస్ (WK), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, జకీర్ అలీ/మహెదీ హసన్, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, టాస్కిన్ అహ్మద్, తాంజిమ్ హస్త్‌ఫ్.