Gautam Gambhir: ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లిన టీమిండియా హెడ్ కోచ్..
- కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లిన గౌతం గంభీర్
- వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్రాన్స్‌కు గౌతీ
- తన కుటుంబంతో విమానాశ్రయంలో ఉన్న వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం ఫ్రాన్స్‌కు బయలుదేరాడు. తన కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అయితే.. గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో విమానాశ్రయంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి ఐపీఎల్‌లో అభిమానులు తమ అభిమాన మాజీ క్రికెటర్‌ను చూడలేరు. భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గంభీర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా అతను కీలక పాత్ర పోషించాడు. అతని మార్గదర్శకత్వంలో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకుముందు 2022, 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా సేవలు అందించారు. అయితే.. ఇప్పుడు భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో 2025 ఐపీఎల్ సీజన్‌లో అతని భాగస్వామ్యం ఉండదు.
Read Also: IPL 2025: ఉప్పల్‌లో ఎల్లుండి మ్యాచ్.. భారీ బందోబస్తు ఏర్పాటు
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
గౌతమ్ గంభీర్ తన భార్య నటాషా.. కుమార్తెలు ఆజీన్, అనైజాలతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లాడు. భారత క్రికెట్ జట్టుతో నిరంతరం ప్రయాణిస్తున్న గంభీర్.. కొంత విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాడు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా పెద్ద విజయాలను సాధించింది. అతని శిక్షణలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మార్చి 9న, న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Read Also: Airtel: ఐపీఎల్ లవర్స్ కోసం ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్..
రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గంభీర్ జట్టుకు నాయకత్వం వహిస్తూ 8 నెలలు పూర్తయ్యాయి. గంభీర్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సుదీర్ఘ పర్యటనలో కూడా పాల్గొన్నాడు. మరోవైపు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు గానూ.. భారత జట్టుకు రూ.58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మొత్తం ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక బృందం, అలాగే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీకి పంపిణీ చేయనున్నారు.
Gautam Gambhir & his family left for France for Vacation. @GautamGambhir @natashagambhir2 pic.twitter.com/KQDwGgWzxk
— Gauti Harshit Dhiman (GG Ka Parivar) (@GautiDhiman) March 21, 2025
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి