ఐపీఎల్ 2025 మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఫ్యాన్స్‌కు సమయం రానే వచ్చింది. రేపు (శనివారం) నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం (ఎల్లుండి) సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Read Also: Cyber Security SP: తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్ బ్యాన్..
కాగా.. ఈ మ్యాచ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. 2700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే.. ఈ మ్యాచ్‌కు వచ్చే అభిమానులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. 300 మంది పోలీసులు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్‌లో 1218 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. బందోబస్తులో భాగంగా.. 12 బెటాలియన్లు , 2 ఆక్టోపస్ బృందాలు ,10 మౌంటెడ్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. 450 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు.. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు.
Read Also: Airtel: ఐపీఎల్ లవర్స్ కోసం ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్..
కంట్రోల్ రూమ్‌కు ఏసీపీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగనుంది. స్టేడియం ఎంట్రెన్స్ వద్ద స్నిఫర్ డాగ్స్ తో పాటు బాంబ్ స్వాడ్ తనిఖీలు చేపట్టనున్నారు. మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ బృందాలు ఉండనున్నాయి. అలాగే.. మ్యాచ్ కోసం వచ్చే అభిమానులకు ఐదు చోట్ల స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యా్ప్ టాప్, మ్యాచ్ బాక్స్, అంబ్రెల్లా, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధించారు. కాగా.. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్ కు మూడు గంటల ముందు స్టేడియం గేట్లు ఓపెన్ చేయనున్నారు. ప్రేక్షకులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ను వినియోగించుకోవాలని కోరింది. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో తినుబండారాలపై విపరీతమైన రేట్లు ఉంటున్నాయని గుర్తించాం.. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. స్టేడియం బయట ఎవరైనా టికెట్లను విక్రయిస్తున్నట్లుగా తెలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొంది. మొత్తం 19 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు.