Umesh Yadav: టీమిండియా ఫాస్ట్ బౌలర్ రెండోసారి ఉమేష్ యాదవ్ తండ్రి అయ్యాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. ఉమేష్ యాదవ్‌కు ఈ హోలీ చాలా ప్రత్యేకంగా నిలిచింది. మార్చి 8వ తేదీని ఉమేష్ యాదవ్ ఎప్పటికీ మరిచిపోలేడు. ఉమేష్ భార్య తాన్య అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఉమేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరితో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇటీవల ఉమేష్ యాదవ్ తన తండ్రి మరణంతో బాధపడ్డాడు.
ఉమేష్ యాదవ్, తాన్యను 2013లో వివాహం చేసుకున్నారు. ఉమేష్ 2021లో మొదటిసారి తండ్రి అయ్యాడు. అతని భార్య అందమైన కుమార్తెకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి ఉమేష్ మరో చిన్నారికి తండ్రి అయ్యాడు. ఉమేష్ యాదవ్ కంటే ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ల ఇళ్లలో ఆడపిల్లలు పుట్టారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవీంద్ర జడేజా కూడా కూతుళ్ల తండ్రులే. ఇప్పుడు ఈ జాబితాలో ఉమేష్ యాదవ్ కూడా చేరిపోయాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఉమేష్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజే ఆడబిడ్డ వారి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిందంటున్నారు.
Blessed with baby girl ❤️ pic.twitter.com/nnVDqJjDGs
— Umesh Yaadav (@y_umesh) March 8, 2023