Rohith Sharma Son Name Ahaan: ప్రస్తుత టీమిండియా వన్డే, టెస్టులలో నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మకు గత నెలలో వారసుడు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దింతో రోహిత్ కుటుంబం సంపూర్ణం అయింది. వీరిద్దరికీ మొదట కూతురు సమైరా ఉండగా.. నవంబర్ 15, 2024న కొడుకు జన్మించాడు. అయితే అప్పటినుంచి టీమిండియా క్రికెట్ అభిమానులు రోహిత్ కొడుకు పేరు తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ భార్య రితిక ఓ పోస్ట్ లో ఫోటోను పోస్ట్ చేసి కాస్త వెరైటీగా పేరును తెలిపింది. ఇంతకీ రితిక చేసిన పోస్ట్ వివరాలు చూస్తే..
Also Read: BiggBoss 8 : విష్ణు ప్రియకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్
నేటి నుంచి డిసెంబర్ నెల మొదలు కావడంతో క్రిస్మస్ నేపథ్యంలో భాగంగా రితిక ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అందులో నాలుగు బొమ్మల పై రోహిత్ కుటుంబం సంబంధించిన పేర్లను రాసి పోస్ట్ చేసింది. ఇందులో ఓ బొమ్మపై ‘రో’ అని రోహిత్ శర్మ పేరు రాయగా.. దానికి పక్కనే మరోవైపు ‘రిట్స్’ అంటే రితిక అని వచ్చేలా రాసి ఉంది. మరోవైపు అమ్మాయి బొమ్మపై ‘సామీ’ అని కూతురు పేరు సమైరా పేరును రాసి ఉంది. ఇక చిన్న పిల్లాడి తలపై ‘ఆహాన్’ అని రాసి ఉంచింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ కొడుకు పేరు ‘ఆహన్’ అని పెట్టినట్లుగా ప్రపంచానికి తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొడుకు పుట్టిన సందర్భంగా పెర్త్ టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.
Also Read: Upcoming Smart Phones: డిసెంబర్ నెలలో రాబోయే టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవే