Mahanadu 2025: నేడు మూడోరోజు టీడీపీ మహానాడు.. 5 లక్షల మందితో బహిరంగ సభ!
- నేడు మూడోరోజు టీడీపీ మహానాడు
- 5 లక్షల మందితో బహిరంగ సభ
- వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప జిల్లాలో టీడీపీ ‘మహానాడు’ అంగరంగ వైభవంగా జరుగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే మహానాడులో ఇప్పటికే రెండు రోజులు విజయవంతగా పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా సమావేశాలు నిర్వహించారు. పసుపు పండగలో రెండోరోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. ఇక చివరి రోజైన గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
మహానాడులో గురువారం మూడోరోజు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పాలన సాగిన తీరు, భవిష్యత్తు లక్ష్యాలపై పార్టీ అధినేత, ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనాలు తరలిరానున్నారు. గురువారం సమావేశం జరిగే చోట లక్ష మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కడపకు వచ్చే మార్గాల్లో మరో 2 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశారు.
Also Read
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్‌తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
Also Read: PBKS vs RCB: నేడే క్వాలిఫయర్ 1.. ఫైనల్లో తొలి అడుగు ఎవరిదో?
మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండోరోజు తరలివచ్చారు. మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇక మూడో రోజు మరింత ఎక్కువగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనాలు రానున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. గత 4-5 రోజుల నుంచి కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది.
తాజావార్తలు
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్‌ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?