TDP – Janasena New Logo: ఎన్నికల ప్రచారానికి టీడీపీ-జనసేన కొత్త లోగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP – Janasena New Logo: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి నుంచి “రా కదలి రా!” పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించబోతోంది.. తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు.. సైకిల్ – గాజు గ్లాసుతో కూడిన లోగోను ఆవిష్కరించారు అచ్చెన్నాయుడు.. ఆక, పంచాయితీల సమస్యలపై రేపు సర్పంచులతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తారు.. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు, 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ బహిరంగసభ ఏర్పాట్లలోమునిగిపోయారు పార్టీ నేతలు.
Read Also: Amalapuram: అమెరికా నుంచి అమలాపురానికి ఐదు మృతదేహాలు.. బోరున విలపించిన ఎమ్మెల్యే
Also Read
- Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
- Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
- Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన రా కదలిరా పిలుపునే మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అని ఈ సందర్భంగా వెల్లడించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్ ని ఆందోళనప్రదేశ్ గా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. అన్ని సభలు తెలుగుదేశం – జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయి. చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు. పార్లమెంట్ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహిస్తాం.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు ఎంతోమంది సంపప్రదిస్తున్నారని తెలిపారు. కొత్త, పాత వారి సమన్వయం కోసం ఓ కమిటీ ఇప్పటికే పని చేస్తోంది. వైసీపీ నుంచి వచ్చే వారి పట్ల ఆచితూచి వ్యవహరిస్తాం అన్నారు అచ్చెన్నాయుడు.

తాజావార్తలు
-
Nara Lokesh: వాయిదాపడే ప్రసక్తే లేదు.. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి!
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!