చంద్రబాబు 160 సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.
లోక్‌సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, విలువైన వస్తువులు భారీగా పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) రికార్డు స్థాయిలో డబ్బును సీజ్ చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర తాయిలాలను ఈసీ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల ప్రచారంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్లతో పోలిస్తే.. ఈసారి 34 శతం…