తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కేబినెట్‌లో కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉదయనిధి.. డిప్యూటీ సీఎం కాబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి.
టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ లేదా రేపు.. స్పీకర్ ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ ఫిర్యాదు చేయనుంది. కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిపై టీడీపీ అనర్హత పిటిషన్ ఇవ్వనుంది. ఆ నలుగురిని అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ స్పీకర్ ను కోరనుంది. అనర్హత పిటిషనుకు బలం చేకూర్చేలా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనుంది టీడీపీ.
ఇండియాలో కరోనా విలయం మామూలుగా లేదు. ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. కరోనా నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు తరఫున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2021 టోర్నీ నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు అశ్విన్. తన కుటుంబ సభ్యుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో…