Vijay Deverakonda Speech at Family Star Pre Release Event: ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ నమస్కారం చెప్పారు. ఆరేళ్ళ క్రితం ఇదే డైరెక్టర్ తో బిగ్గెస్ట్ హిట్ గీత గోవిందం చేశాను. నన్ను అభిమానించే అందరూ మెచ్చుకున్న సినిమా గీత గోవిందం అని అన్నారు. ఒక ఇంటర్వ్యూలో విజయ్ నీ గురించి ఎలాంటి గాసిప్ వినాలి అనుకుంటున్నావు అని అడిగితే విజయ్ సినిమా 100 కోట్లు కొట్టింది అని వినాలి అనుకుంటున్నాను అని చెప్పాను. అది నాకు ఒక కల, కానీ నా నాలుగో సినిమాకే అది సాధ్యం అయ్యేలా చేసిన సినిమా అది. ఆ తరువాత కూడా నేను ఎన్నో మంచి సినిమాలు మీకు ఇవ్వాలని ప్రయత్నించాను. కానీ గీతగోవిందం సినిమాని బీట్ చేసే సినిమా మరి ఏదీ ఇవ్వలేకపోయాను. ఆ తర్వాత 200 కోట్లు కలెక్ట్ చేస్తాను అని ఒక సినిమా సమయంలో చెప్పాను. ఆ టైంలో ఎంతో మంది నాకు సన్నిహితులు, శ్రేయోభిలాషులు చెప్పారు. ఇలాంటి వయసులో నువ్వు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే నీకు పొగరు అనుకుంటారు అని కానీ ఒకటి చెబుతున్న 200 కోట్లు కలెక్ట్ చేస్తాను అని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కలెక్ట్ చేయలేకపోవడం తప్పు అంటూ విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తిన్నా, అవమానాలు ఎదుర్కొంటా అని అంటారు.
Mrunal Thakur: తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ సాష్టాంగ నమస్కారం
నేను ఏదో ఒక రోజు 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తా అప్పటివరకు ఈ అవమానాలు పడుతూనే ఉంటా ఇప్పుడు కూడా ఈ మాటలను పొగరు, బలుపు అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అన్నాడు విజయ్ దేవరకొండ. ప్రతి రోజు నిద్ర లేచినప్పటి నుంచి నా నమ్మకం అదే. ఎవరో స్టార్ అయితే నేను అవలేనా? నేను అయితే మీరు అవలేరా? అని ప్రశ్నించారు. ఇక ఎవరో 200 కోట్లు కలెక్ట్ చేస్తే? నేను చేయలేనా? నేను చేస్తే మీలో ఒకరు చేయలేరా? అని ప్రశ్నించారు. మీలో కూడా చాలామంది చాలా రకాల స్థాయిలోకి వెళ్లాలని కలలు కంటూ ఉంటారు అది వేరే వాళ్ళకి పెద్దగా అనిపించొచ్చు వాళ్ళు చులకన చేయవచ్చు కానీ మీరు అనుకున్న దారివైపు నడిస్తే ఏదో ఒక రోజు మీరు అనుకున్నది సాధిస్తారు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? అని ప్రశ్నించారు. హ్యాపీగా ఉండండి, మీ కలలు సాకారం చేసుకోవడానికి తపించండి అన్నారు. ఈ సినిమా నా కెరీర్లో ఒక స్పెషల్ ఫిలిం అని అన్నారు. మా ఫ్యామిలీ ఎదుగుదలకు మా చుట్టాలు ఎందరో సహకరించారు. వినగానే వాళ్ళకోసం అయినా సినిమా చేయాలనిపించి వెంటనే ఒప్పేసుకున్నా అని అన్నారు. ఇక నా నటన విషయంలో కంప్లీట్ క్రెడిట్ డైరెక్టర్ కే ఇచ్చేస్తాను అని అన్నారు. విజయ్ గాడికి కొత్తగా బ్రేక్స్ ఏమీ అక్కర్లేదు, మా నాన్న పేరు నిలబెట్టేలా చేయండి అని అన్నారు.