ఏపీలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అంటున్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. వైసీపీ ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర నుంచే తిరుగుబాటు ప్రారంభమైందని….వచ్చే ఎన్నికల్లో 160సీట్లుతో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అనుమతి లేకుండా ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు అతికిస్తే తిప్పి కొట్టాలని శ్రేణులకు పిలుపు ఇచ్చారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది 8 నెలలు మాత్రమే అన్నారు అచ్చెన్నాయుడు.
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులకు కబడ్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర సర్వీసులు నుంచి వచ్చిన అధికారుల చర్యలన్నీ గుర్తు పెట్టుకుంటున్నామని వాళ్లేవరు తప్పించుకోపోయే అవకాశం లేదన్నారు అచ్చెన్న.
Read Also: Upasana Konidela: ఉపాసన సీమంతం.. రంగరంగ వైభవమే
తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం విశాఖలో ప్రారంభమైంది. విశాఖలో జరుగుతున్న జోన్-1 క్లస్టర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఆరు జిల్లాలు 34 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత, బూత్ స్థాయిలో బలోపేతంపై నిర్ధేశం చేస్తున్నారు. క్లస్టర్ల వారీగా ఓటర్ వెరైఫికేషన్ వీలైనంత త్వరగా పూర్తి చెయ్యడం సహా కొత్త నమోదులపై ఫోకస్ పెట్టాలని చర్చ జరిగింది. తద్వారా ప్రతీ నియోజకవర్గ పరిధిలో 5నుంచి 10శాతం ఓటింగ్ పెంచుకోవలనేది నిర్ధేశం. నిత్యం ప్రజల్లో ఉండేందుకు తద్వారా పార్టీకి సమన్వయం చెయ్యడం సాధ్యం అవుతుందనేది టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
Read Also: Different Amit Shah: భిన్నమైన అమిత్ షాని చూశాం.. ముస్లిం నేతల ప్రశంసలు