TDP: ఘంటా రాజీనామా ఆమోదం.. టీడీపీ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: దాదాపు మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. ఇంత కాలం ఆ రాజీనామా వ్యవహారాన్ని పక్కనబెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇప్పుడు ఉన్నట్టుండి ఆమోద ముద్రవేయడం చర్చగా మారింది. అయితే, దీనికి వెనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.. ఇక, ఘంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయ్యింది.. వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్యా బలం తగ్గించేలా వైసీపీ వ్యూహం అంటున్నారు టీడీపీ నేతలు.. ఇదే సమయంలో.. పార్టీ మారిన నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పైనా వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తోంది..
Read Also: YSRCP Strategy: గంటా రాజీనామా ఆమోదం వెనుక వైసీపీ వ్యూహం..
Also Read
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
- T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్‌ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. అయితే. ఆ నలుగురిపైనా వేటు పడుతుందని టీడీపీ భావిస్తోంది.. వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్దం చేస్తోంది టీడీపీ.. తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై తామిచ్చిన డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ల ఆమోదం విషయంలో స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తోంది.. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్‌ను ఇప్పటికే వేసింది తెలుగుదేశం పార్టీ.. ఒకవేళ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అనర్హత వేటు పడితే.. టీడీపీ రెబల్‌లు అయినటువంటి కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై కూడా వేటు వేయాల్సిందేననే విధంగా స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది.
తాజావార్తలు
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
-
T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్‌ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!