సూదుల నుంచి విమానాల వరకు అన్నింటినీ తయారు చేస్తున్న దేశంలోనే అత్యంత విశ్వసనీయ సంస్థ టాటా.. ఇప్పుడు మొబైల్ తయారీ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. అయితే ఒక దశాబ్దం క్రితం టాటా గ్రూప్ మొబైల్ నెట్‌వర్క్‌లు, హ్యాండ్‌సెట్‌లను తయారు చేసేది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారం వైపు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఓ పెద్ద చైనా కంపెనీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. డీల్ ఖరారైతే.. ఈ చైనా కంపెనీలో టాటాకు 51 శాతం వాటా ఉంటుంది. అంటే దాని నియంత్రణ స్థానిక కంపెనీకి వస్తుంది.
READ MORE: Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు
వాస్తవానికి.. భారత ప్రభుత్వం అన్ని చైనా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన ప్రధాన వాటాను భారతీయ కంపెనీకి విక్రయించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి టాటా గ్రూప్‌తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వివో భారతీయ కంపెనీతో కలిసి తయారీ, పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది.
రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, వివో కంపెనీ వాల్యుయేషన్‌పై ఈ విషయం ఆధారపడి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. టాటా తన వైపు నుంచి కంపెనీ విలువను అందించింది. అయితే Vivo దానిని మరింత పెంచాలని భావిస్తోంది. టాటా గ్రూప్ ఖచ్చితంగా ఈ డీల్ గురించి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు ఏదీ ఖరారు కాలేదు.
ప్రస్తుతం నోయిడాలోని టెక్జోన్ IT పార్క్‌లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఉంది. అక్కడ నుంచి గ్రేటర్ నోయిడాలోని 170 ఎకరాల్లో నిర్మించిన కొత్త యూనిట్‌కు బదిలీ చేయబడుతుంది.Vivo 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలను ఆర్జించింది. రూ.29,874.90 కోట్ల ఆదాయం వచ్చిందని.. అలాగే రూ.211 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.123 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం, Vivo దేశంలోని ప్రతి రాష్ట్రంలో భారతీయ పంపిణీదారులను నియమించడం ప్రారంభించింది.