Tarun Chugh : కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ లో బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ పర్యటించారు. ఈ సందర్భంగా పోచమ్మ మైదాన్ సెంటర్ లోని రాణిరుద్రమ దేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తరుణ్ చుగ్, బీజేపీ నేతలు. అనంతరం లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పై మీద ఈడి విచారణ చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. లిక్కర్ స్కాంలో విచారణ కోసం పిలిస్తే ఆ విచారణ సంస్థలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తుందని, మోసం చేసిన వాళ్లను ప్రశ్నిస్తే తప్పుదారి పట్టించడంలో కేసీఆర్ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Parliament Sessions: రేపటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. వ్యూహాస్త్రాలు సిద్ధం
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
వరంగల్ లో రాణిరుద్రమాదేవి ఆశీస్సులు తీసుకోవటం సంతోషంగా ఉందని, స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నిధులిస్తుంటే.. కేసీఆర్ సర్కారు నిధులను పక్కదారి పట్టిస్తోందన్నారు. కేసీఆర్ సర్కారు తెలంగాణను లూటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కాదు.. అలీబాబా నలభై దొంగల సర్కార్ అంటూ ఆయన విమర్శించారు. దోచేయ్..దాచెయ్ అన్నట్లుగా ఉంది కేసీఆర్ పాలన అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో తోలుబొమ్మలా మారిందని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బైబై చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు తరుణ్ చుగ్. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించబోతున్నారని ఆయన అన్నారు.
Also Read : Revanth Reddy : కేసీఆర్ పాలనలో తెలంగాణలో మద్యం ఆదాయం పెరిగింది
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..