తెలంగాణలో బీజేపీ నేతలు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. రోజు రోజుకు తెలంగాణలో బీజేపీ బలపడుతుందనేది సర్వేల నివేదిక. అయితే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండాలను ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కమలనాథులు. అయితే ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు బీజేపీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్‌చుగ్ ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. దీనిలో తెలంగాణ ముఖ్య నేతలు పాల్గొంటారని ఆయన వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో వివిధ అంశాలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు.
Also Read : Radhika Sharathkumar: ఏ ఒక్క మగాడికైనా ఆ మాట చెప్పే దమ్ముందా..?
తెలంగాణ తాజా రాజకీయాలు.. పార్టీ బలోపేతం పై చర్చ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కేసీఆర్ వ్యవహార శైలి కూడా చర్చకు వస్తాయని ఆయన తెలిపారు. కేసీఆర్ అహంకారం, హింసా ప్రవృత్తిగా మారిందని ఆయన విమర్శించారు. మా ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమని తరుణ్ చుగ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య, అహింస మార్గంలోనే కేసీఆర్‌ను ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. ఫాంహౌస్ ఎపిసోడ్ కేసీఆర్ డ్రామా అంటూ ఆయన ధ్వజమెత్తారు.